Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..! 1 y ago
8K News-10/03/2025 దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్లో మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 22,600 మార్క్ దాటింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 74,560 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 22,625 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.